శంకర్రావును పరామర్శించిన ఎంపీ వివేక్
హైదరాబాద్
లో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీమంత్రి శంకర్రావును ఎంపీ
వివేక్ ఈ ఉదయం పరామర్శించారు. అనంతరం అక్కడున్న బందువులు, వైద్యులతో
శంకర్రావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన
వివేక్... ఎలాంటి నోటీసులు లేకుండా శంకర్రావును అరెస్టు చేశారన్నారు.
ఈ సంఘటనపై కేంద్ర హోం మంత్రి షిండేని కలిసి అరెస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశామనీ, దానికి షిండే వెంటనే స్పందించారనీ వివేక్ అన్నారు. ఆ పర్యవసానంగానే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో దర్యాప్తు చేపట్టిందన్నారు. కాగా, వివేక్ కు శంకర్రావు బావ అవుతారు.
ఈ సంఘటనపై కేంద్ర హోం మంత్రి